News

నయీం కేసులో టీడీపీ నేతకు నోటీసులు


నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్యకు నార్సింగి పోలీసుల నోటీసులు జారీ చేశారు. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు ఆయన హాజరైనారు. నయీంతో ఉన్న సంబంధాలపై కృష్ణయ్యను పోలీసులు గంటపాటు విచారించారు. ఆర్‌. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నయీంతో పలువురు అధికారులకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు.